2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా..“ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్…చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు..కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి.
గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు…ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది…తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది అన్నారు.
నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది…మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది.గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు.ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు.
