మీడియా చిట్ చాట్లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారు…ఎవరు ఏం అనుకున్నా.. మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు అని స్పష్టం చేశారు.
మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంతమంది రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు… ఢిల్లీ, హైదరాబాద్ లో లాబీయింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అన్నారు. మేడారం పనులు వేగంగా జరగాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన… మంత్రిగా నాకు, నా శాఖ కార్యదర్శికి ప్రతి విషయం నోటీసులో ఉండాలన్నదే నా ఉద్దేశం అన్నారు.
కొంత మంది రెడ్డి నాయకులు నా మీద కుట్ర చేస్తున్నారు.. ప్రభుత్వంలో లాబీయింగ్ చేస్తున్నారు.. నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారు అన్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని, రూ.71 కోట్ల టెండర్ ను తన మనుషులకు ఇప్పిస్తున్నాడని కొండా సురేఖ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దేవాదాయ శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కొండా.
