- Advertisement -

తప్పుడు ప్రచారంపై జోగి ఫిర్యాదు

- Advertisement -

నకిలీ మద్యం కేసులో జ‌రుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్. విజయవాడ సీపీ కార్యాలయానికి వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , రమేష్ యాదవ్ , వరుదు కళ్యాణి , పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు , టి.జె.ఆర్.సుధాకర్ బాబులతో కలిసి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు రమేష్.

నకిలీ మద్యం కేసులో తనపై సోష‌ల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని జోగి ర‌మేష్ సీపీని కోరారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ లో వచ్చే ఫేక్ వార్తలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సీపీని కోరారు.

నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్‌రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైయస్ఆర్‌సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -