మావోలకు వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మల్లోజుల లొంగుబాటు మర్చిపోక ముందే మరో మావోయిస్టు టాప్ లీడర్ ఆశన్న ఛత్తీస్‌ఘఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆశన్న అలియాస్ తక్కలపల్లి వసుదేవ రావు అలియాస్ రూపేష్ , DKZC మాద్ డివిజన్ ఇన్-చార్జ్ రణితా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ముందు లొంగిపోయారు.
డిసెంబర్ 2, 2000 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి సహా 1999లో రాజకీయ మరియు పోలీస్ వ్యక్తుల హత్యలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. DKZC మాద్ డివిజన్‌ను నేతృత్వం వహించిన రణితా కూడా లొంగిపోయిన వారిలో ఒకరు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 1,785 అరెస్టులు, మరియు 477 మంది ఎన్కౌంటర్లో హతం అయ్యారని తెలిపారు. ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా.
