పాక్-అఫ్గాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలను ఆపడం నాకు చాలా సులభం అని… ఇప్పటికే ఎనమిది యుద్ధాలను ఆపాను అని తెలిపారు.
దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపి లక్షలాది మంది జీవితాలను కాపాడటం నాకు ఇష్టం…పాక్-అఫ్గాన్ యుద్ధం ఆపితే మొత్తంగా నేను తొమ్మిది యుద్ధాలు ఆపినట్లు అవుతుంది అని ట్రంప్ వెల్లడించారు.
ఆఫ్ఘానిస్తాన్–పాకిస్తాన్ ఘర్షణను తాను సులభంగా పరిష్కరించగలనని అయితే అమెరికాను నడపడం తనకు అవసరమని అన్నారు. తనకు యుద్ధాలను పరిష్కరించడం ఇష్టం తెలుసా ఎందుకు? ఎందుకంటే నాకు ప్రజలు చనిపోవడం ఆపడం ఇష్టం. నేను కోట్లాది ప్రాణాలను రక్షించాను అని తెలిపారు.
పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ప్రతీకార దాడులు జరిపి, దురాండ్ లైన్ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఆక్రమించి, పలు సైనికులను చంపింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం 48 గంటల కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే శుక్రవారం ఆ విరమణ గడువు ముగియగానే, పాకిస్తాన్ సైన్యం మళ్లీ ఆఫ్ఘానిస్తాన్‌పై దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు సహా ఎనిమిది మంది మరణించారు.
