- Advertisement -

కోటి సంతకాల సేకరణ..ప్రజా ఉద్యమం

- Advertisement -

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సోషల్ మీడియా ఆధ్వర్యంలో (కోటి సంతకాల సేకరణ) ప్రజా ఉద్యమాన్ని చేపట్టారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజి రెడ్డి ఆదేశాలతో యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం త్రిపురాంతకం మండలంలోని మిరియంపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సమీకరణ, రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మాలపోలు శ్యామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసకు వచ్చిన పీపీపీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నేడు కుట్ర పూరితంగా ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఆయా మండల కన్వీనర్లు సొంటి నాగార్జున రెడ్డి,లిగంగుంట్ల భాస్కర్ ,కొమ్ము రవి,ఎంపీటీసీ సభ్యులు సాయపనేని సుబ్బారావు,ఉప సర్పంచ్ మాలపోలు రమణయ్య ,మాజీ సర్పంచ్ బోయలపల్లి గాలెయ్య ,గ్రామ పార్టీ అధ్యక్షులు అణిగిరేకుల రవయ్య,సోషల్ మీడియా సభ్యులు మోను,నరసింహ,జగన్ మోహన్ రెడ్డి,మారం రెడ్డి శివ రెడ్డి ,శివ గారు, అచ్చిబాబు గారు,వసంత్ గారు, పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -