- Advertisement -

తేజస్వీ సీఎం అవుతాడు!

- Advertisement -

తేజస్వీ యాదవ్ బీహార్ కాబోయే సీఎం అని జోస్యం చెప్పారు మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి. బీహార్ ప్రజలు తేజస్వీని ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారు…. తేజస్వీ చెబితే చేస్తాడు అని ఆమె స్పష్టం చేశారు. అలాగే తన పెద్దకొడుకు జనశక్తి జనతాదళ్ (JJD) అధ్యక్షుడు తేజప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై రాబ్రీ దేవి మాట్లాడుతూ…ఎన్నికల్లో పోటీ చేయడం తేజప్రతాప్ ఇష్టమని..ఆయనకు ఆ హక్కు ఉందన్నారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసింది. అన్ని రంగాలను ప్రైవేట్ చేతుల్లోకి ఇచ్చి, ఆ డబ్బంతా మోదీ ఇంటికే వెళ్లింది…బీహార్ సీఎం నీతీశ్ కుమార్ ₹70,000 కోట్ల మోసం చేశారు, కానీ దానిపై ఎవరూ మాట్లాడడం లేదు అన్నారు. లాలూ జీ ఎలాంటి తప్పు చేయలేదు — నేరారోపణలు ఉన్నప్పటికీ శిక్షించబడ్డారు…ము న్యాయం కోసం కోర్టులో పోరాడుతాం అన్నారు.

రాఘోపూర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు తేజస్వీ యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేస్తారు..మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాఘోపూర్‌లో అన్ని అభివృద్ధి పనులు చేస్తాం అన్నారు. మహాఘట్‌ బంధన్ అధికారికంగా తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా,ముకేష్ సహానిని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో,నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీల్లో జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -