Sunday, May 5, 2024
- Advertisement -

బీహార్‌లో నేడు తుది విడత ఎన్నికలు.. టెన్షన్ లో అభ్యర్థులు!

- Advertisement -

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తుది విడత పోలింగ్ శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల ముందు క్యూ కట్టారు. మొత్తం 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 1,204 మంది అభ్యర్థులు ఉన్నారు. సుమారు 2.34 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. శనివారం జరిగే ఎన్నికల్లో బీహార్ ప్రభుత్వంలోని 11మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తుది విడత ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఇప్పటివకే రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్ జరిగింది.

మూడోదశ ఎన్నికల్లో కోసి-సీమాంచల్ ప్రాంతంలో అత్యధిక స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. చివరి దశ పోలింగ్ శనివారం ముగిసిపోనుండగా నవంబర్ 10న వోట్ల లెక్కింపు జరగనున్నది.ఈ ఎన్నికలతోపాటు జేడీయూ ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఖాళీ అయిన వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది.

ఏన్డీయే, మహాఘట్‌బంధన్‌‌తోపాటు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, బీఎస్పీ, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్‌పీ‌లు ఈ విడతలో పట్టు సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. గెలుపు ఎవరి పక్షాన ఉండబోతుందన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది.

‘కార్తీకదీపం’కు గుడ్ బై చెప్పన డాక్టర్ బాబు..? ఏమైంది…?

సెనెటర్లుగా ఎన్నికైన చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్లు!

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -