- Advertisement -

చంద్రబాబు సీఎం అయితేనే..తొక్కిసలాటలు!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా తొక్కిసలాట ఘటనలు జరుగుతూనే ఉంటాయి అని కామెంట్ చేశారు బొత్స. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ ప్రతిపక్షాలపై నెపాన్ని వేస్తున్నారని మండిపడ్టారు.

కాశీబుగ్గ వేంకటేశ్వస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందితే ఆలయం ప్రైవేట్‌ ఆలయమని పేర్కొనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా లేదా అని ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుందని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కూటమి ప్రభుత్వ పాలన వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉందని వెల్లడించారు. తుపాను పంట నష్టంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. మొంథా తుపాను వల్ల అన్ని రకాల పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటివరకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -