ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగలేదన్న విమర్శలను కొట్టిపారేశారు.ఆయన మాట్లాడుతూ, “నేను నా కొడంగల్ నియోజకవర్గానికే అన్ని కాలేజీలు తీసుకువచ్చాను.
అందులో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ITI మరియు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూలు కూడా కొడంగల్‌కు తీసుకువచ్చాను అని ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలకు పిలుపుత్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, “రెండు-మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రజలకు ఆయన కీలక సందేశం ఇచ్చారు: “అభివృద్ధికి అడ్డుపడే వారిని ఎన్నుకోవద్దు. అభివృద్ధి చేసే వారికే అండగా నిలవండి. ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించాలి” అని ఓటర్లను కోరారు.
