ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు సెలబ్రిటీలు కూడా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకుంటున్న మహేష్ బాబు, క్రిస్మస్ ఈవ్‌ను కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో వారి పిల్లలు సితార, గౌతమ్‌తో పాటు స్నేహితులు కూడా కనిపిస్తున్నారు. మహేష్ బాబు క్యాజువల్ రెడ్ టీ-షర్ట్‌తో పాటు బ్లూ జీన్స్‌లో సింపుల్‌గా, కానీ స్టైలిష్‌గా కనిపించారు.
అందరూ నవ్వుతూ ఉత్సాహంగా పోజులిచ్చిన ఈ కుటుంబ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ సందడి వెనుక కారణం మహేష్ బాబు మాత్రమేనని చెప్పాల్సిన అవసరం లేదు.
మహేష్ బాబు త్వరలోనే ‘వారణాసి’ సినిమా షూటింగ్ సెట్స్‌కు తిరిగి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సరైన సమయంలో అధికారికంగా వెల్లడించనున్నారు.
