చేతకాని సన్నాసి రాహుల్ గాంధీ.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఎందుకు ఇచ్చావు అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రెండేళ్లు గడిస్తే ఇంతవరకు 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైందని పిల్లలు రోడ్డు ఎక్కితే వాళ్ళు ఇష్టమొచ్చినట్లు గొడ్లను కొట్టినట్లు కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది అన్నారు.
ఇవాళ కూడా రేవంత్ రెడ్డి అటు పక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ పోతున్నాడని భయంతో అరెస్టులు మీద అరెస్టులు చేయిస్తున్నాడు అన్నారు కేటీఆర్. మళ్ళీ రెండున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుంది… మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి మేము నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం అన్నారు. మేము MANUU విద్యార్థులకు మద్దతుగా ఉంటాం.. ఢిల్లీలో పోరాటం చేయడానికి కూడా మీతో కలిసి వస్తాం అన్నారు.
రాజ్యసభలో MANUU భూములపై మాట్లాడతాం…సీరియల్ కిల్లర్స్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సీరియల్ స్నాచర్స్ అని మండిపడ్డారు. గతంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి 100 ఎకరాల భూమిని తీసుకున్నారు.. అక్కడ విద్యార్థులు ఆందోళన చేసినా కూడా అక్కడ హైకోర్టు కడుతామని చెప్పారు.
అలాగే HCUలో కూడా 400 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారు.. అందులో 10 వేల కోట్ల కుంభకోణం ఉందని నిర్ధారణ అయితే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు అన్నారు.
ఒకవేళ HCU భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఉర్దూ యూనివర్సిటీ భూములు కబ్జాకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదు … ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారు.. వాళ్ల దగ్గర కూడా 100 ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారు అని ఆరోపించారు.
