మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ఫ్యామిలీది తిరుగులేని చరిత్ర. శరద్ పవార్ నుండి మొదలైన రాజకీయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కీలకమే. అందుకే పవార్ కుటుంబం మహారాష్ట్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వంశాల్లో ఒకటి.
దశాబ్దాలుగా, ఈ కుటుంబ సభ్యులు ప్రాంతీయ మరియు జాతీయ రాజకీయాల్లో సత్తా చూపారు. ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ప్రభావం ప్రధానంగా బరామతిలో, పూణే జిల్లాలో ఉంది.
ఓ సారి పవార్ ఫ్యామిలీ హిస్టరీని చూస్తే..
శరద్ పవార్: సీనియర్ రాజకీయ నేత, NCP స్థాపకుడు, మాజీ కేంద్ర మంత్రి
అనంతరావ్ పవార్: శరద్ పవార్ సోదరుడు, అజిత్ పవార్ తండ్రి
అజిత్ పవార్ తక్షణ కుటుంబ సభ్యులు:
భార్య: సునేత్రా పవార్ – సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే వారు.
కొడుకులు: పార్థ్ పవార్, జయ్ పవార్
శరద్ పవార్ కుటుంబం:
భార్య: ప్రతిభా పవార్
కూతురు: సుప్రియా సులే – బరామతి నుండి మూడు సార్లు లోక్‌సభ ఎమ్మెల్యే, NCP(శరద్ పవార్ వర్గం)
సంతానం: విజయ్ (కొడుకు), రేవతి (కూతురు)
పార్థ్ పవార్, జయ్ పవార్: అజిత్ పవార్ కొడుకులు, రాజకీయ/సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు. అలాగే రోహిత్ పవార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అజిత్ పవార్ మరియు శరద్ పవార్ మధ్య రాజకీయ మార్గ భేదాలు కుటుంబంలో విభజనలకు దారి తీశాయి. 2023 లో అజిత్ పవార్ BJP-శివసేనా మాయుయుతి కూటమితో పొరపాటు నిర్ణయం తీసుకోవడం వలన NCP లో శరద్ పవార్ వంశం నుండి విడిపోయారు.
