మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మందమర్రి పట్టణంలో కుటుంబ కలహాలు రక్తపాతం దారితీశాయి. భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం ప్రకారం, అవంతి అనే మహిళ తన భర్త మోహన్‌తో గత కొంతకాలంగా కుటుంబ విషయాలపై తరచూ గొడవపడుతున్నట్లు తెలిసింది. ఈ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆగ్రహానికి లోనైన అవంతి ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తపై దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన మోహన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.
హత్య అనంతరం అవంతి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన అసలు కారణాలు ఏమిటి? గతంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
కుటుంబ కలహాలు ఇలాంటి విషాదాలకు దారితీయకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
