- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పాస్టర్ చేసిన దుశ్చర్యతో బాలిక గర్బం దాల్చింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువులో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గ్రామంలో చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నారు చౌటపల్లి రాంబాబు (42). గత కొంతకాలంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు రాంబాబు. ఈ క్రమంలో
మోతాదుకు మించి బాలికతో గర్బనిరోధక మాత్రలు మింగించాడు చర్చి పాస్టర్.
తీవ్ర రక్తస్రావంతో అనారోగ్యం పాలైంది బాలిక. వెంటనే వైద్యం నిమిత్తం ఏలూరు తరలించారు తల్లిదండ్రులు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో చర్చి పాస్టర్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
