- Advertisement -

మౌనంగా బాధపడేది పురుషులే!

- Advertisement -

టెలివిజన్ సూపర్ స్టార్ రూపాలి గంగూలీ పురుషులపై జరిగే దౌర్జన్యం తరచుగా గుర్తింపుకి రాకుండా, చెప్పుకోకుండా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఆమె నటిస్తున్న హిట్ టీవీ సీరియల్ ‘అనుపమా’లో త్వరలో ప్రసారమయ్యే శక్తివంతమైన ఎపిసోడ్‌లో పురుషులపై దౌర్జన్యం మరియు దాని వల్ల కలిగే మానసిక వేదన ప్రధాన అంశాలుగా ఉంటాయి.

ప్రస్తుత కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మాట్లాడేందుకు ముందుకు రావాలని, “మగాడివి కదా” అనే కారణంతో మౌనంగా ఉండకూడదని చూపించే ప్రత్యేక సన్నివేశాన్ని సీరియల్‌లో రూపొందించారు. ఈ కథాంశంపై స్పందిస్తూ, ‘అనుపమా’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న రూపాలి గంగూలీ అన్నారు. అనుపమా నిర్మాతలు సమాజంలో చెప్పుకోని అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు టీవీ డ్రామాల్లో ఎక్కువగా మహిళలనే బాధితులుగా చూపిస్తారు, పురుషులను నిందితులుగా చూపిస్తారు. మహిళలపై హింస వాస్తవమే అయినప్పటికీ, పురుషులూ మౌనంగా బాధపడుతుంటారు అని తెలిపారు.

అదేవిధంగా నిర్మాతలు రాజన్ షాహీ, దీపా షాహీ సమాజంలో ఇంకా టాబూ‌గా భావించే అంశాలను ధైర్యంగా ప్రస్తావిస్తున్నారని ఆమె ప్రశంసించారు. డీకేపీ కుటుంబంలో భాగమవడం, రాజన్‌జీ విజన్‌కు మౌత్‌పీస్‌గా ఉండడం నాకు గర్వంగా ఉంది అని తెలిపారు. తల్లిదండ్రులను, మహిళలను సాధికారత చేయడం, పిల్లలకు సరైన మార్గం చూపించడం వంటి లక్ష్యాలతో మేము ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు పురుషులపై దౌర్జన్యం, గృహహింసలో భర్తే బాధితుడిగా ఉండే అంశాన్ని ప్రస్తావించడం నాకు ఎంతో గర్వకారణం అని రూపాలి గంగూలీ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -