- Advertisement -

మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే ..చంద్రబాబు!

- Advertisement -

ఏపీ మాజీ సీఎం జగన్‌….మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబు… అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్‌లో కూడా పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, స్వయంప్రశంసలే కనిపించాయని జగన్ ఆరోపించారు.

ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్లి “చంద్రబాబు బాండ్లు” పంచారని, ఏ పథకం కింద ఎంత డబ్బు వస్తుందో చెప్పి ప్రజల నుంచి ఓట్లు సాధించుకున్నారని అన్నారు. ప్రతి కుటుంబాన్ని మోసం చేశారని, హామీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

2014-19 మధ్య చంద్రబాబు హయాంలో రాష్ట్రం రూ.3 లక్షల 90 వేల 247 కోట్ల అప్పులు చేసిందని జగన్ పేర్కొన్నారు. తన ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.3 లక్షల 31 వేల 671 కోట్ల అప్పులు మాత్రమే చేశామని చెప్పారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామన్న వారు ఇప్పుడు అప్పుల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారని విమర్శించారు.

గ్రోత్ రేటు పెరిగితే తలసరి ఆదాయం పెరగాలని, కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని జగన్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1,19,927 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పిందని, కానీ వాస్తవంగా రూ.94,937 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. గత 10 నెలల్లో రాష్ట్ర ఆదాయం రూ.75,964 కోట్లేనని చెప్పారు.

23 రాష్ట్రాల ఆదాయ పురోగతి జాబితాను సీఏజీ విడుదల చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉందని జగన్ వెల్లడించారు. అయితే ప్రభుత్వం మాత్రం జీఎస్టీ వృద్ధి రేటులో దూసుకుపోతున్నామని చెబుతోందని విమర్శించారు.

ఇక నాయకుల ఆడంబరాలపై కూడా జగన్ మండిపడ్డారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రైవేట్ విమానంలో కొలంబో వెళ్లాల్సిన అవసరం ఉందా? టీవీలో చూడలేరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లు విమానాలు, హెలికాప్టర్లలో జల్సాగా తిరుగుతున్నారని ఆరోపించారు. రాత్రి కొలంబోలో మ్యాచ్ చూసి ఉదయానికి విజయవాడకు, మళ్లీ సాయంత్రానికి ఢిల్లీకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుత నేతలు ఇలా వ్యవహరించారా? అని ప్రశ్నిస్తూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -