తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న టీవీ డిబేట్లను నిలిపివేయాలని కోరుతూ విజయవాడ సీనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ చింతా వెంకటేశ్వర్లు తన వాదనలో, తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని SIT ఇప్పటికే నిర్ధారించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని మీడియా ఛానెల్లు ఆ అంశంపై నిరంతరం చర్చలు నిర్వహిస్తూ ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి కథనాలు, డిబేట్లు నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ABN Andhra Jyothy, TV5 News, Maha News, ETV Andhra Pradesh ఛానెళ్లకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణలో ఈ అంశంపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. తిరుమల లడ్డూ వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
