ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని షకీరా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌లో మళ్లీ ప్రదర్శన ఇవ్వనున్నారు. కొలంబియా సూపర్‌స్టార్ ఏప్రిల్ 10న ముంబైలో, ఏప్రిల్ 15న ఢిల్లీలో కచేరీలు నిర్వహించనున్నారు. ఈసారి రెండు నగరాల్లో కచేరీలు నిర్వహించడం ప్రత్యేకం. షో టికెట్ల నిర్వహణను District by Zomato చేపట్టింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, షకీరా చివరిసారిగా 2007లో తన Oral Fixation Tour సందర్భంగా ముంబైలో ప్రదర్శన ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె భారత్‌లో మళ్లీ స్టేజ్‌పైకి రానున్నారు.
తన రాకపై షకీరా స్పందిస్తూ..భారత్‌లో ప్రదర్శన ఇవ్వడం ఎప్పుడూ నాకు ప్రత్యేకమే. ముంబై, ఢిల్లీ అభిమానులతో మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. Feeding India Concert కేవలం సంగీతం కోసం మాత్రమే కాదు; ప్రతి చిన్నారికి పోషకాహారం అందేలా కలిసి నిలబడటానికి ఇది ఒక వేదిక” అని తెలిపారు.
మూడు దశాబ్దాల కెరీర్లో షకీరా ప్రపంచంలోనే అత్యధికంగా ఆల్బమ్‌లు అమ్ముడైన గాయనులలో ఒకరు. Whenever, Wherever , Hips Don’t Lie , Waka Waka , She Wolf వంటి పాటలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.
