ఈ మధ్యకాలంలో తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నటి తాప్సీ పన్ను. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం Assi ప్రమోషన్స్ సందర్భంగా ఆమె భారతీయ సినిమాల్లో మహిళల ప్రతిరూపం గురించి మాట్లాడారు.
హిందీ సినిమాల్లో క్లీవేజ్‌పై ఎక్కువ ఫోకస్ ఉంటే, దక్షిణ భారత సినిమాల్లో నాభిపై దృష్టి పెడతారు అంటూ వివిధ పరిశ్రమల్లో పాటల చిత్రీకరణ సమయంలో శరీరంలోని కొన్ని భాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ధోరణి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీశాయి.
తాప్సీ తన ప్రారంభ దశలో చేసిన తెలుగు, తమిళ చిత్రాల అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. కొన్ని పాటల చిత్రీకరణ సమయంలో ప్యాడెడ్ బ్రాలు ధరించమని పరోక్షంగా సూచించారని చెప్పారు. అలాంటి సూచనలు అసిస్టెంట్ల ద్వారా రావడం తనకు అసౌకర్యంగా అనిపించేదని ఆమె పేర్కొన్నారు. సెట్స్‌పై రూపురేఖల విషయంలో నటీమణులు ఎదుర్కొనే ఒత్తిడిని ఇది ప్రతిబింబిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
తన తెలుగు తొలి చిత్రం జుమ్మంది నాదం సమయంలో జరిగిన ఒక ఘటనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక సన్నివేశంలో సెన్సువాలిటీ పెంచేందుకు కొబ్బరికాయను తన నడుముపై విసిరారని తెలిపారు. ఆ సమయంలో ఆ ఘటనపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
