- Advertisement -

రామాయణ..ఏఐ ఫోటోలు వైరల్!

- Advertisement -

2026లో విడుదలకు సిద్ధమవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి రామాయణ. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే యష్ రావణుడిగా,సన్ని డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా, మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇటీవల సోషల్ మీడియాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి శ్రీరాముడు, సీత పాత్రల్లో ఉన్నట్లు కనిపించే కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ చిత్రాల్లో ఇద్దరూ బంగారు కిరీటాలు ధరించి, సంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడినట్లు కనిపిస్తున్నారు. రణబీర్ చేతులు జోడించి నిలబడగా, సాయి పల్లవి ఆయన వైపు చూస్తూ సీతలా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఇవి సినిమా షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలు అని చాలా మంది భావించారు.

అయితే నిజానికి ఈ ఫోటోలు నితేష్ తివారి దర్శకత్వంలోని రామాయణ సినిమా సెట్స్‌కు చెందినవి కావు. ఏఐ సహాయంతో మార్పులు చేసిన చిత్రాలు. ఆ సీరియల్‌లో శ్రీరాముడి పాత్ర పోషించిన నటుడు ఆశీష్ శర్మ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఆయన సోషల్ మీడియాలో ఈ ఫోటోలను మళ్లీ షేర్ చేస్తూ “ఇదిగో మరో ‘ఆరిజినల్’ లీక్ ఫోటో. కానీ AI నా జుట్టును మాత్రం మార్చలేకపోయింది” అని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఫోటోలు నిజం కాదని అభిమానులకు స్పష్టమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -