- Advertisement -

రామాయణ టీజర్‌..మిక్స్‌డ్ రెస్పాన్స్

- Advertisement -

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రామాయణ’ టీజర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. టీజర్‌లో రణ్‌బీర్ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్‌ రావణుడిగా, అలాగే రవి దూబే లక్ష్మణుడిగా కనిపించిన చిన్న చిన్న గ్లింప్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

అయితే టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వచ్చాయి. ఆదిపురుష్ తర్వాత ఇదే నిజమైన రామాయణ ప్రదర్శన అని కొందరు, ఈ సినిమా థియేటర్లలో తప్పకుండా చూడాలి..క్వాలిటీ అద్భుతంగా ఉంది, మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది అని సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మించగా నితీష్ తివారి దర్శకత్వం వహించారు. భారీ స్థాయిలో ప్రాచీన భారతాన్ని పునఃసృష్టించేందుకు ఈ సినిమా ప్రత్యేకంగా రూపొందుతోంది.

రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ కానుండగా సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -