మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె. అబ్దుల్ కలాం కన్నుమూశారు.

షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా అబ్దుల్ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

ఆర్మీ డాక్టర్లు ఆయనకు చేసిన చికిత్స  ఫలించలేదు. కలాం కడసారి చూపుకోసం దేశవ్యాప్తంగా ప్రముఖులు భారీ సంఖ్యలో షిల్లాంగ్‌కు చేరుకుంటున్నట్లు తెలిసింది.