- Advertisement -

చంద్ర‌బాబుకు మ‌హా న్యూస్‌కు ఏం సంబంధం..?

- Advertisement -

తెలంగాణలో జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనల నేపథ్యంలో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టు శంకర్ , పృథ్వీరాజ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

జర్నలిస్టు శంకర్ మాట్లాడుతూ…చంద్రబాబుకు మహా న్యూస్‌తో ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించారు. ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆయనే కేసు పెట్టాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.అయితే, ఇక్కడ ఒక రిపోర్టర్‌ను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఏపీ పోలీసులు తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే, భవిష్యత్తులో “క్విట్ తెలంగాణ” ఉద్యమం రావచ్చని శంకర్ హెచ్చరించారు. గుంటూరు ఘటనకు, కర్నూలు ఫోర్త్ టౌన్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ, తెలంగాణలోని జర్నలిస్టులను ఏపీకి తీసుకెళ్లడం సరికాదని అన్నారు.చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియా పోస్టుల విషయంలో తెలంగాణ పోలీసులు Xకు లేఖ రాయడం కూడా వివాదాస్పదమైంది. తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డినా..? లేక చంద్రబాబు నాయుడా..? అంటూ శంకర్ ప్రశ్నించారు.

పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ….తెలంగాణలో ఏపీ ప్రభుత్వమే నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. జర్నలిస్టు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ దీనికి నిదర్శనమని అన్నారు.అతన్ని ఏపీ పోలీసులు కర్నూలుకు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీ ప్రాంతం, నీ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టును కూడా కాపాడలేకపోయాడు అంటూ పృథ్వీరాజ్ యాదవ్ విమర్శించారు.

చంద్రబాబుకు అంత నొచ్చుకుంటే… మా కడుపు ఎంత మండాలి అంటూ పృథ్వీరాజ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు కూడా వివాదాస్పదంగా మాట్లాడినట్లు ఆరోపిస్తూ, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అరెస్ట్ ఘటన రాజకీయ రంగంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. రెండు రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్ట అమలు వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -