- Advertisement -
ఆన్‌లైన్‌లో పేకాట ఆడడానికి డబ్బుల కోసం ఇద్దరిని దారుణ హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్‌లో జరిగిన జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శవాలపై బంగారం తీసుకుని తనఖా పెట్టి ఆన్‌లైన్ జూదం ఆడారు. గత నెల 11న కారులో లిఫ్ట్ ఇస్తానని యాదమ్మ అనే వృద్ధురాలిని ఎక్కించుకొని హత్య చేశాడు.
ఆమె ఒంటిపై ఉన్న బంగారం అమ్మి రూ.26,500తో ఆన్‌లైన్ పేకాట ఆడాడు నిందితుడు.
అందులో డబ్బులు పోగొట్టుకొని, గత నెల 14న మంగమ్మ అనే మరో వృద్ధురాలిని హత్య చేశాడు. పట్టపగలే కారులో శవాలను తీసుకెళ్లి 20 కిలోమీటర్ల దూరంలోని మోకిలలో పారేశాడు నిందితుడు. నిందితుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఓ వైద్యుడి ఇంట్లో కారు డ్రైవర్‌గా పని చేసే వాసుగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు ఫిలింనగర్ పోలీసులు.
