- Advertisement -

మాచ‌ర్ల‌లో దారుణం..ఒంట‌రి మ‌హిళ‌పై గ్యాంగ్ రేప్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు సమాచారం. దాహంగా ఉంది… నీళ్లు ఇవ్వండి అంటూ ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. ఆ తర్వాత కత్తితో బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

ఘటన అనంతరం స్థానికులు స్పందించి బాధిత మహిళను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొనగా ఈ దారుణ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -