సినీ నటి హన్సిక కుటుంబ వివాదం కోర్టు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన వదిన నాన్సీ జేమ్స్‌పై హన్సిక రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు సమాచారం.
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపిస్తూ నాన్సీ జేమ్స్‌పై హన్సిక రూ.2 కోట్ల డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. గృహహింస ఆరోపణలతో తన ఇమేజ్ దెబ్బతిందని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల నాన్సీ జేమ్స్ సోషల్ మీడియాలో హన్సిక కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె పలు పోస్టుల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ ఆరోపణలను ఖండించిన హన్సిక….నాన్సీ జేమ్స్ కేవలం డబ్బు వసూలు చేయడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం ద్వారా తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే ఈ వివాదం కోర్టుకు చేరడంతో, ఇరుపక్షాల వాదనలు వినిపించిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.
