తెలంగాణ రాజకీయాల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన అక్రమ మైనింగ్ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద మండిపడ్డారు. సీఎం రేవంత్ ..అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నట్టు చెప్పి, అధికారులను పంపి వారిని పట్టుకుని నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సంబంధిత మంత్రి ఎందుకు మౌనంగా కూర్చున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.
12 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? అప్పుడే అసెంబ్లీలో నిలబడి మీకు సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? అంటూ హరీష్ రావు విమర్శించారు. అలాగే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిజాలు బయటపడుతున్నాయని అన్నారు.
ఆ భూమి ప్రభుత్వానికి చెందినదే అయితే, ఇప్పటివరకు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. పేదల ఇళ్లపై వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని, ఈ వ్యవహారం ఇక్కడితో ముగియదని హెచ్చరించారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారుతోంది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, తదుపరి చర్యలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
