మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ చిత్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ‘భారత వర్ష: సాగా ఆఫ్ శూల’ (Bharata Varsha: Saga of Shula) అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘ది ఘాజీ ఎటాక్’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 7వ శతాబ్దపు నేపథ్యంలో, చరిత్రలో పెద్దగా ఎవరికీ తెలియని ఒక అధ్యాయం ఆధారంగా తెరకెక్కుతోంది.
టైటిల్ ప్రకటన కోసం విడుదల చేసిన వీడియోలో గోపీచంద్ మునుపెన్నడూ లేని విధంగా చాలా పవర్‌ఫుల్ మరియు స్ట్రైకింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విజువల్స్ అన్నీ కూడా భారీ నిర్మాణ విలువలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా గ్రాండ్‌గా ఉండబోతుందని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. అలాగే వినోద్ కుమార్, గావీ చాహల్, తనికెళ్ళ భరణి, రాకేశ్ వర్రే, భరత్ రెడ్డి, ఛత్రపతి శేఖర్, రవివర్మ, కిషోర్, కార్తికేయ, మధుమణి మరియు బేబీ తేజల్ వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది.
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి (శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్),సంగీతం: అనూదీప్ దేవ్,ఛాయాగ్రహణం: మణికందన్ ఎస్,ప్రొడక్షన్ డిజైన్: చిన్నా,యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
