- Advertisement -

ఇంట్లో రెండు..రైలు పట్టాలపై మూడు శవాలు!

- Advertisement -

తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు.. రైలు పట్టాలపై మూడు శవాలు ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ అంతుచిక్కని ఆత్మహత్యల మిస్టరీని చేధించే పనిలో పడ్డారు పోలీసులు.

స్థానికంగా ఉండే మోహన్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం ఆ ఫ్యామిలీలో విషాదాన్ని నింపింది. ఇంట్లోని వేర్వేరు గదుల్లో విగతజీవులుగా తల్లి చంద్రకళ, భార్య హరిత ఉండగా వేపగుంట వద్ద రైలు పట్టాలపై మోహన్ కొడుకు కౌశిక్, కుమార్తె హిమాని మృతదేహాలు లభించాయి.

భార్య హరిత మెడకు చున్నీ బిగించి ఉన్నట్లు గుర్తించగా ఐదుగురి మృతి వెనుక అసలేం జరిగిందనే అంశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -