- Advertisement -

తమిళనాడు ఓటెత్తిన ప్రముఖులు!

- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు సామాన్య ప్రజలతో పాటు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు తరలివచ్చారు. రజనీకాంత్, విజయ్, అజిత్,కమల్ హాసన్‌తో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండగా, సినీ దిగ్గజాల రాకతో పోలింగ్ బూత్‌ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటులను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

టీవీకే (TVK) అధినేత, దళపతి విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది.సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.అజిత్ కుమార్, ధనుష్, చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, జయం రవి, శశికమార్ తదితరులు ఓటు వేశారు.

త్రిష కృష్ణన్, శృతి హాసన్, సిమ్రాన్, స్నేహ, ఖుష్బూ సుందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనిరుధ్ రవిచందర్, స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆర్జే బాలాజీ తదితరులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం సెలబ్రిటీలు మీడియా ద్వారా యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.

2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తమిళనాడులో ఓటింగ్ శాతం భారీగా పెరగడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -