- Advertisement -

పూజ చేసే గుడిలోనే పూజారి ఆత్మహత్య!

- Advertisement -

తెలంగాణలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. భార్య మరణం తట్టుకోలేక మానసిక ఎదుగుదల లేని కొడుకుతో కలిసి అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.తాను పూజలు చేసే ఆలయంలోని కోనేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు అర్చకుడు.

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండలగూడెం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గత 20 ఏళ్లుగా పూజారిగా పని చేస్తూ, మానసిక ఎదుడుగల లేని కొడుకు పవనకుమారాచార్యులు(25)తో కలిసి ఉంటున్నారు వరయూరు లక్ష్మీనరసింహ చార్యులు(54) అనే అర్చకుడు.

గత నెల 16వ తేదీన తన భార్య శ్రీదేవి మరణించిన రోజు నుండి తీవ్ర ఆందోళనలో ఉండేవాడని, ఏనాటికైనా తన కొడుకుతో కలిసి ఆలయ కోనేరులో దూకి చనిపోతామని చెప్పేవాడని తెలిపారు స్థానికులు.రెండు రోజుల క్రితం కొడుకుతో కలిసి ఆలయ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనరసింహ చార్యులు, నిన్న కోనేరులో తేలాయి మృతదేహాలు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -