- Advertisement -

తమిళనాడు సినీ పరిశ్రమకు సీఎం విజయ్ కానుక

- Advertisement -

తమిళనాడు చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) చిరకాల డిమాండ్‌పై ఆ రాష్ట్ర‌ నూతన ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు మొదటి వారం రోజులు (ఏడు రోజులు) పాటు రోజుకు ఐదు ప్రదర్శనలు (5 Shows) ఇచ్చుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల థియేటర్ల యజమానులకు.. నిర్మాతలకు ఆర్థికంగా పెద్ద లబ్ధి చేకూరనుంది.

తమిళనాడు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రతినిధులు మే 16, 2026 న ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. థియేటర్లలో ప్రదర్శనల సంఖ్యను పెంచాలని.. అన్ని సినిమాలకు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేలా జీవో ఇవ్వాలని వారు సీఎంను కోరారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను.. థియేటర్ల నిర్వహణ వ్యయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) సామాజిక మాధ్యమం X (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేసింది.

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. స్థానిక పండుగలు లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రమే ప్రత్యేక అనుమతితో ఐదో ఆటకు అవకాశం కల్పించేవారు. ఇందుకోసం జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు.. చెన్నై నగరంలో పోలీస్ కమిషనర్ల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధనల వల్ల సాధారణ రోజుల్లో పెద్ద సినిమాలకు సైతం కలెక్షన్ల పరంగా ఇబ్బందులు ఎదురవుతుండేవి.

సినీ ప్రముఖుల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన ముఖ్యమంత్రి విజయ్.. పాత నిబంధనలకు సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులకు ఆమోదం తెలిపారు. ఇకపై కొత్త తమిళ సినిమాలు విడుదలైన మొదటి ఏడు రోజుల పాటు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండానే నేరుగా ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై తమిళనాట హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే సినీ పరిశ్రమకు భారీ ఊరటనిచ్చేలా విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -