- Advertisement -

టీడీపీ మహానాడు..అట్టర్ ఫ్లాప్!

- Advertisement -

టీడీపీ మహానాడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. హైబ్రిడ్ మహానాడు.. అట్టర్‌ఫ్లాప్ మహానాడని మళ్లీ ఫ్రూఫ్ అయింది అన్నారు. ఒక పక్క స్పీచ్‌లు.. మరో పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు అని ఎద్దేవా చేశారు. మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేర్ల కంటే.. వైసీపీ అధినేత జగన్ నామస్మరణే ఎక్కువ చేశారు అన్నారు.

మహానాడు వేదికపై టీడీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్‌ అసహ్యంగా ఉందని.. ఇది సైకిల్‌ పార్టీ మహానాడా?.. సైకో పార్టీ మహానాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మహిళా కక్షపాతిగా మారారంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు మహానాడు వేదికగా రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టే రోజే టీడీపీ మహిళా నేతలంతా ఢిల్లీకి వెళ్లారని.. బిల్లు వీగిపోయిన తర్వాత సాయంత్రం పార్టీ చేసుకున్నారని ఆరోపించారు. కూటమిని ఎన్నికల హామీల గురించి ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి పార్టీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు హెరిటేజ్ ఆస్తుల్లో తల్లికి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్పాలని.. ఆయన తల్లితో, చెల్లితో ఉన్న ఒక్క ఫోటో బయట పెట్టాలన్నారు. వైఎస్ జగన్ తన చెల్లికి దేశంలో ఎవరూ ఇవ్వని ఆస్తి ఇచ్చారని.. వైఎస్ వివేకా హత్య గురించి అధికారంలో ఉన్న చంద్రబాబును సునీత, షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నవారిని కలిశారు కాబట్టి వాళ్లంతా మహిళా ద్రోహులన్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వారంతా హాజరయ్యారని..టీడీపీకి బీజేపీతో బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం కాంగ్రెస్‌తో డిన్నర్ అంటూ చురకలు అంటించారు.

విద్యాశాఖ మంత్రిగా టోటల్ ఫెయిల్.. కూటమి నేతలు కాళ్లు పట్టుకుంటే గెలవలేని లోకేష్.. వైఎస్ జగన్ నాట్ సేమ్ అంటూ సెటైర్లు పేల్చారు. సుగాలి ప్రీతి పేరు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందని. ఆమెకు వెంటనే న్యాయం చేయాలన్నారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీనలు గాలికి వదిలేశారని చెప్పారు రోజా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -