పత్తికుంటపల్లి గ్రామంలో కాఫీ విత్ వైయస్ఆర్ సీపీ కేడర్ కార్యక్రమంను నిర్వహించి, గ్రామ ప్రజలను పలకరించారు మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, పత్తికుంటపల్లి పంచాయతీ పత్తికుంటపల్లి గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి పలకరించారు.
ప్రజల బాగోగులు తెలుసుకుంటూ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాడని, ఎప్పుడు ప్రజలు శ్రేయస్సు కోరే జననాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసాతో పాటు పంట బీమా ఇస్తూ రైతులకు భరోసాగా నిలబడ్డ ఏకైక నాయకుడు జగనన్న అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తీవ్రంగా అన్యాయం చేశారని, ప్రతి ఒక్కరికి వివరించారు.
