- Advertisement -

ఇకపై గోవా వెళ్లకండి..ఏపీలోనే అంతా!

- Advertisement -

మందుబాబులకు మరింత కిక్ ఇచ్చే న్యూస్. ఏపీలో ఆదాయాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు సర్కార్‌కు మద్యమే దిక్కైంది. మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది . అంటే ఇకపై గోవా తరహాలో బీచ్‌లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. సూర్యలంక‌, విశాఖ బీచ్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

గోవా తరహాలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు బీచ్ షాక్స్ కు అనుమతివ్వాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా రెండు బీచ్ లలో అమలు.. భవిష్యత్తులో అన్ని బీచ్‌ల‌లో అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా బీచ్‌లలో పర్యాటక అనుభూతిని పెంపొందించడం తద్వారా ప్రభుత్వ ఆదాయం, మద్యం అమ్మకాలను ప్రోత్సహించడమే టార్గెట్‌.

మొదటి దశలో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్,విశాఖపట్నంలోని బీచ్‌లో అమలు చేయనుండగా ఈ రెండు ప్రాంతాలలో లభించే ఆదరణ, భద్రతా ప్రమాణాలు …సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ బీచ్‌లకూ విస్తరించనున్నారు. రాత్రి వేళల్లో భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 8 గంటల వరకే అనుమతించనున్నారు.

ఈ నిర్ణయం ద్వారా ఏపీ తీర ప్రాంతాలకు దేశీయ… అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బీచ్‌లలో అంతర్జాతీయ స్థాయి వసతులు, వినోదం మరియు మద్యం అందుబాటులో ఉంచడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం మందుబాబులకు పండగే అయినా చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -