- Advertisement -

కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు ఆగ్రహం..

- Advertisement -

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంపై మత్స్యకారుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మారినా తమ తలరాతలు మారలేదని, తమ కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రాజకీయ కక్షసాధింపులు, అరెస్టుల గురించి మాట్లాడటమే తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపూ అరెస్టులు చేయాలని చెప్పడం తప్ప.. టీడీపీ, జనసేన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు మా మత్స్యకారుల బాధలు పట్టడం లేదా? కూటమి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి అనేది ఉందా? అని నిలదీశారు.

నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కేవలం ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ డ్యూటీలు చేస్తూ స్వాగతాలు పలకడానికే పరిమితమయ్యారని, ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేటకు వెళ్లి గల్లంతైన లేదా ఇతర ఇబ్బందుల్లో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యుల గురించిన సమాచారం లేక మత్స్యకార మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ అండ దొరకకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

మాకు కష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా రాలేదు. మా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. వేటకు వెళ్లిన మా వారు ఇప్పుడు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలియడం లేదు. కనీసం భరోసా ఇవ్వడానికి ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరకు రాలేదు అని మత్స్యకార కుటుంబాలు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితులకు అండగా నిలవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -