- Advertisement -

ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..

- Advertisement -

ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తవుతోంది. ఇప్పటికే కూటమి.. వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తున్నాయి. తమ పాలన పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతోందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ మాత్రం ప్రభుత్వం పైన వ్యతిరేక తీవ్ర స్థాయిలో ఉందని చెబుతోంది. ఈ సమయంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.

ఏపీలో మరో ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత స్థానిక ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కేడర్ ఇప్పటి నుంచే ఇందు కోసం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. తాజాగా పవన్ తోనూ ఇదే అంశం పైన చర్చించినట్లు తెలుస్తోంది. అటు పవన్ సైతం జనసేన నేతలకు స్థానిక ఎన్నికల పైన సమాచారం ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఈ నెల 15న స్థానిక ఎన్నికల పైన కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల కోసం మూడు పార్టీల నుంచి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో.. సమస్యలు రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అటు, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు స్థానిక ఎన్నికల పైన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. ప్రతీ స్థానం లో వైసీపీ అభ్యర్ధి బరిలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎక్కడైనా ఏ కారణంతో అయినా పార్టీ అభ్యర్ధి బరిలో లేకపోతే.. అక్కడి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. దసరా అయిన వెంటనే ముందుగా మున్సిపల్ ఎన్నిక లు.. దశల వారీగా మిగిలిన స్థానిక ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15న కూటమి సమన్వయ కమిటీ సమావేశం ద్వారా ఎన్డీఏ.. 16వ తేదీన పార్టీ నేతల సమావేశంలో జగన్ స్థానిక ఎన్నికల పైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -