- Advertisement -

వన్డేలపై గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

- Advertisement -

వన్డే క్రికెట్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నడుమ భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదన్న ఐసీసీ (ICC) నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. వన్డే ప్రపంచకప్ అనేది ఎప్పటికీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని స్పష్టం చేస్తూనే.. వన్డేలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేందుకు ముక్కోణపు , చతుష్కోణపు సిరీస్‌లను పునరుద్ధరించాలని గిల్ ప్రతిపాదించారు.

ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి వన్డేకు ముందు బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడారు. నేను వన్డే క్రికెట్ చూస్తూనే పెరిగాను. అది నా చిన్నతనంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రపంచకప్ అనగానే మొదట గుర్తొచ్చేది 50 ఓవర్ల ప్రపంచకప్పే. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్. దీనిని 40 ఓవర్లకు తగ్గించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. గతంలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌లు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్‌ల కంటే ఇలాంటి మల్టీ-టీమ్ టోర్నీలు నిర్వహిస్తే ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా చాలా మజా వస్తుంది” అని గిల్ అన్నారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-0తో, అంతకుముందు ఐర్లాండ్ చేతిలో 2-0తో ఎదురైన ఓటములు వన్డే జట్టుపై ఎలాంటి ప్రభావం చూపవని గిల్ నొక్కి చెప్పారు. ఇది వేరే ఫార్మాట్, భిన్నమైన జట్టు. మా లక్ష్యాలు కూడా వేరేగా ఉంటాయి. మేము ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచాం. ఇప్పుడు వన్డేలపై దృష్టి పెట్టాం, ఇక్కడి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని స్పష్టం చేశారు.

నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లు గాయపడటం దురదృష్టకరమని, 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యువకులను ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆడించి సిద్ధం చేయడమే తమ ప్రణాళిక అని గిల్ పేర్కొన్నారు. ఈ వారం ఆరంభంలో తానే స్వయంగా విరాట్ కోహ్లీతో మాట్లాడినట్లు గిల్ వెల్లడించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ జట్టు కలయికలు…ఏయే బౌలర్లు, ఆల్‌రౌండర్లు భవిష్యత్తులో ఉపయోగపడతారనే అంశాలపై చర్చించినట్లు చెప్పారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. గత దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ లైన్-అప్‌కు రోహిత్ భాయ్, విరాట్ భాయ్ వెన్నెముకగా నిలిచారు. వారి అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో కీలకం అని గిల్ కొనియాడారు. అలాగే, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తొలిసారి వన్డే బరిలోకి దిగుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంపై కూడా గిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -