- Advertisement -

టీడీపీ నేత‌ల వేధింపులు..వైసీపీ నేత ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

- Advertisement -

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. ఆలమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకుడు అంకె నరేంద్ర తెలుగుదేశం పార్టీ (TDP) నాయకుల వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.

బాధిత అంకె నరేంద్ర ఆత్మహత్యాయత్నానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను పంచుకున్నారు. ఎస్ఐఆర్ (SIR) లో టీడీపీ నాయకుడు సూరి అక్రమంగా దొంగ ఓట్లను నమోదు చేయిస్తుండగా, తాను ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకున్నానని తెలిపారు. ఆ కారణంతోనే ఆలమూరుకు చెందిన టీడీపీ నాయకుడు ఆలమూరి గోనుగుంట్ల సూర్యనారాయణ తనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని నరేంద్ర కన్నీరు పెట్టుకున్నారు.

టీడీపీ నేత సూర్యనారాయణ స్థానిక హౌసింగ్ ఏఈ (Housing AE) సంపత్ కుమార్‌తో చేతులు కలిపి, తప్పుడు ఆరోపణలతో తనను మోటార్ల దొంగగా చిత్రీకరించారని నరేంద్ర సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. మా నాన్న వాల్మీకి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న మా కుటుంబంపై ఇలాంటి దొంగతనం నేరాలు మోపారు. అంతటితో ఆగకుండా మా ఇంటిని కూడా కూల్చివేయడానికి ప్రయత్నించారు అని నరేంద్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఆలమూరు గ్రామానికి చెందిన టీడీపీ నేతల నిరంతర వేధింపులు, వేటుల వల్లే తాను ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడినట్లు, తన చావుకు ఆ నేతలే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంకె నరేంద్ర పరిస్థితి విషమించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తక్షణమే స్పందించారు. నరేంద్రకు మెరుగైన మరియు అత్యవసర వైద్య చికిత్స అందించడం కోసం ఆయనను బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

రాప్తాడు రాజకీయాల్లో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ కక్షసాధింపులతో ఒక సామాన్య నాయకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన టీడీపీ నేతలపై, తప్పుడు కేసు పెట్టడానికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -