- Advertisement -

ఏపీ పెట్టబడులు..బాబు సర్కార్ బాగోతం ఇదే!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు తరలివస్తున్నాయని చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారిక గణాంకాలకు, ఈ ప్రకటనలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందనే చర్చ తీవ్రమవుతోంది.

ప్రతిపాదిత ఒప్పందాలను (MoUs) మరియు అంచనాలను క్షేత్రస్థాయిలో పూర్తయిన పెట్టుబడులుగాను, భవిష్యత్తులో వచ్చే అవకాశమున్న ఉద్యోగాలను ఇప్పటికే లభించిన నియామకాలుగాను చూపిస్తూ ప్రచారం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో పెట్టుబడులకు సంబంధించి ఎంపీ మిథున్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది కేంద్రం. మొత్తం గ్రౌండ్ అయినవి: గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే క్షేత్రస్థాయిలో నిర్మాణ/ప్రారంభ దశకు చేరుకున్నాయి.

వీటిలో ఉత్పత్తి లేదా నిర్మాణం పూర్తి చేసుకున్నవి కేవలం రెండు పరిశ్రమలు మాత్రమే.మిగిలిన 8 ప్రాజెక్టులు ఇప్పటికీ వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే కొనసాగుతున్నాయి. గ్రౌండ్ అయిన ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే మొత్తం పెట్టుబడి అంచనా రూ. 6,962 కోట్లుగా మాత్రమే ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి.

పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేశాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితి వేరుగా ఉందనేది పరిశీలకుల అభిప్రాయం.
ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రకటించిన 22,167 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయినవి కావు.ఇవి సదరు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా పూర్తయి, పరిశ్రమలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రావచ్చని కేంద్రం వేసిన అంచనాలు మాత్రమే.

పరిశ్రమల ఏర్పాటుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) లేదా ప్రతిపాదనలు వచ్చినంత మాత్రాన అవి తక్షణ పెట్టుబడులుగా మారవు. ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్న అంశాలను సాధించిన విజయాలుగా చూపించడం వల్ల ప్రజలకు క్షేత్రస్థాయి వాస్తవాలు స్పష్టంగా తెలియడం లేదనే కోణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -