- Advertisement -

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎంపీ.. జగన్ ఏమంటారో..?

- Advertisement -

ఏపీ అధికార పార్టీ అయిన.. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు చేరుతుండగా.. టీడీపీకి షాకుల మీద షాకులు తగిలాయి. ఇప్పుడూ వైసీపీకి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి ఉండటంతో.. వైసీపీ నుంచి 29 మంది ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మ‌రో ఎంపీ టీడీపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ వ‌స్తుందా ? రాదా ? అన్న‌ది.. ఇప్పుడూ కర్నూలు జిల్లాలో పెద్ద పొలిటికల్ టాపిక్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి రేణుక వైసీపీ త‌ర‌పున ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వారం రోజుల‌కే నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఆయ‌న‌తో పాటు ఎంపీ రేణుక భ‌ర్త సైతం టీడీపీలో చేరారు. రేణుక కూడా టీడీపీలో చేరిపోతార‌ని అంద‌రూ అనుకున్నా ఆమె మాత్రం సైలెంట్‌గానే వైసీపీలోనే ఉన్నారు. ఇక ఎస్పీవై.రెడ్డి త‌ర్వాత అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత కూడా త‌ర్వాత వైసీపీకి దూర‌మ‌య్యారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి వైసీపీలో చేరి క‌ర్నూలు ఎంపీగా పోటీ చేస్తార‌ని, జ‌గ‌న్ ఇందుకు ఓకే చెప్పార‌ని వార్త‌లలు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బుట్టా రేణుక‌కు షాక్ త‌ప్ప‌దు. కనుక ఈ క్రమంలో ఆమె వైసీపీకు షాక్ ఇచ్చి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. కోట్ల ఆగ‌స్టులో భారీ స‌భ పెట్టి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌తార‌ని తెలుస్తోంది. కోట్ల వైసీపీలో చేరిన వెంట‌నే రేణుక టీడీపీలో చేర‌తార‌ని స‌మాచారం. అయితే ఇది జరిగితే.. వైసీపీలో నష్టం కలిగే ఛాన్స్ ఉంది. అయితే ఇదే విషయంపై వైసీపీ నేతలు రేణుక టీడీపీలో చేరే అవకాశం లేదు. ఆమె వైసీపీలోనే ఉంటుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -