కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఆనం సోదరులు. ఆ పార్టీ వైపు నుంచి జగన్ పార్టీవైపు చేరడానికి వారు మాటలతో అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానాలు జరుగుతున్నాయని అంటూ ఆనం సోదరులు జగన్ గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తరపున గట్టిగా నిలబడ్డవారిలో ఆనం సోదరులు ముఖ్యులు. అప్పటికే చాలా మంది నేతలు తెలుగుదేశం, వైకాపాలలో చేరిపోగా.. వారు మాత్రం కాంగ్రెస్ లోనే మిగిలారు.
అయితే ఇప్పుడు వారికి అక్కడ బోర్ కొట్టింది. ఎలాగూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదీ లేదు, చచ్చేదీ లేదు అనే భావనకు వచ్చినట్టుగా ఉన్నారు. దీంతో ఆ పార్టీని వీడటానికే నిర్ణయించుకొన్నట్టున్నారు. మరి ఎంత కాంగ్రెస్ ను వీడుతున్నా.. దాని వెనుక రీజన్ చూపించాలి. కాంగ్రెస్ లో పదవులు అనుభవించి. .కష్టకాలంలో ఆ పార్టీని వీడుతున్నారనే అపప్రదను తప్పించుకోవాలంటే.. గట్టి రీజన్ చెప్పాలి. అందుకోసం ఆనం బ్రదర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ లో తమకు అవమానాలు జరుగుతున్నాయని.. తమను పార్టీలో ఉండమంటారా.. వెళ్లిపొమ్మంటారా.. అంటూ ఆనం వివేకానందరెడ్డి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డినే నిలదీశాడట. ఈ విధంగా తాము పార్టీని వీడబోతున్నామని వీళ్లు ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి వీరు ఎప్పుడో జంప్ చేయబోతున్నారో!
