- Advertisement -

స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జగన్

- Advertisement -

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఉక్కు కర్మాగారం) లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు మాజీ సీఎం జగన్. నగరంలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ స్వయంగా కలిసి పరామర్శించారు. బాధితుల వద్దకు వెళ్లి, వారికి అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ఎదుర్కొన్న భయానక పరిస్థితులను బాధితులు జగన్‌కు వివరించారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులను కోరారు. అధైర్యపడవద్దని, వైఎస్సార్‌సీపీ పార్టీ పరంగా మరియు వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన ఉక్కు కార్మికుడు పైడిరాజు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ కలిసి ఓదార్చారు. జగన్‌ను చూడగానే పైడిరాజు భార్య, పిల్లలు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబ సభ్యుల కన్నీళ్లను తూలుస్తూ వైఎస్ జగన్ వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు గరిష్ట పరిహారం అందేలా పోరాడతామని హామీ ఇచ్చారు.

జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో, జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో మరియు సెవెన్‌హిల్స్ ఆసుపత్రి వద్ద వందలాది మంది పోలీసులను మోహరించారు.వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది.

స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక యాజమాన్య నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తూతూమంత్రంగా కాకుండా బాధితులకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం ప్రకటించాలని తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -