2019 సార్వత్రిక ఎన్నికల ఫీవర్.. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికి నుంచే మొదలు అయింది. టీడీపీ ఓ వైపు.. వైసీపీ ఒకవైపు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఇక టీడీపీ, వైసీపీ మాత్రమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. దాంతో ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి.
ఇక నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి.. కారణలు తెలుసుకొని.. పార్టీ నేతల్లోనే ఉన్న అయోమయాన్ని తొలిగించే ప్రయత్నంను ప్రధానంగా పెట్టుకున్నారు. ఇక టీడీపీ నేతలు కూడా వైసీపీ పార్టీలో ఎవరు కూడా చేరరు అని.. పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయి ఉన్న వైసీపీ నేతల్లో జోష్ నింపేందుకు కొందరు సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీ ముందు అడుగు వేసింది. అందుకే పాదయాత్రను వాయిదా వేసినట్లు కూడా లోటస్ పాండ్ వర్గాల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు జగన్ కు టచ్‌లో ఉన్నారు.
కొందరు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వారిని చేర్చుకుంటే జరిగే ప్రయోజనాలేంటి.. అక్కడ ఉన్న పార్టీ నేతలకు వచ్చే ఇబ్బందులేంటి.. అన్న అంశాలపై ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ద్వారా నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని జగన్ ముందుకు సాగనున్నారని సమాచారం. ఏది ఏమైన సీనియర్ నాయకులు వచ్చి.. వైసీపీలో చేరితే.. వైసీపీ మరింత పుంజుకోవడం ఖాయమని.. అంటున్నారు. ఇక ఈ విషయం టీడీపీకి ఇది మింగుడు పడని విషయం అని విశ్లేషకులు అనుకుంటున్నారు.
