- Advertisement -

పవన్ మాటల వెనక సీక్రెట్ ఇదే ?

- Advertisement -

జన సేన అధ్యక్షుడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్ నిన్న అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతి ప్రాంతం మరొక హైదరాబాద్ కాకూడదు అంటూ పవన్ కళ్యాణ్ అన్న మాటల వెనకాల సారంశం ఏంటో చూద్దాం. హైదరాబాద్ కి తక్కువ ఏంటి? అంటూ పలువురు పవన్ అన్న మాటలని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. 

గత 60 ఏళ్లుగా హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. రాజధాని ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో ఉద్యమం చేపట్టి దాన్ని సాధించుకుంది. తెలంగాణను వదులుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దాంతో భారీయెత్తున, ఆర్భాటంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

అయితే ఏపీ లో పరిస్థితి అంత సరిగ్గా లేదు అని పవన్ ఇప్పటికే గమనించినట్టు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంత నాయకులు తమ మీద వివక్ష ఉంది అని ఇప్పటికే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన సమయం లో రాయలసీమ ప్రాంతం వారు శ్రీబాగ్ ఒడంబడిక వాళ్ళ ఏపీ లో కలవడానికి ఇష్టపడ్డారు కానీ మొదట దానికి అసలు వారు ససేమిరా అన్నారు. అప్పట్లో కర్నూలు రాజధానిగా ఆంద్ర రాష్ట్రo ఏర్పడింది. 

హైదరాబాద్ విలీనం కావడం తో ఆంధ్ర కి 1956 లో  హైదరాబాద్ రాజధాని గా మారింది . అప్పటి నుంచీ అంతా హైదరబాద్ కి పెట్టుబడులు పెట్టారు. తెలంగాణా రావడం తో జరిగిన విషయాలు తెలిసిందే. కాబట్టి పెట్టుబడులు అంతా ఒక చోట పోసేసి హైదరబాద్ లాగా అమరావతి ని తాయారు చెయ్యద్దు అని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా ప్రభుత్వం వ్యవహరించాలి అనేది పవన్ ఐడియా కావచ్చు .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -