జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నైపుణ్యం చూసి ఏపీ జనాలు నవ్వుకుంటున్నారు. ఈ మధ్యే సీఎం బాబును కలిశాక… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంపై పవన్ చెప్పిన మాటలు విని పవన్ రాజకీయ పరిపక్వతను ప్రశ్నిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోడీ ఏం చెప్పారు.. ఇప్పుడు పవన్ ఏం చెప్పారో వివరించి మరీ పవన్ తీరును ఎండగడుతున్నారు.కొత్త రాజధాని శంకుస్థాపనను తన చేతులమీదుగా కానిచ్చేసిన ప్రధాని మోడీ.. ఆ టైమ్ లో పాత పాటే పాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటినీ కచ్చితంగా తీరుస్తామని స్పష్టం చేశారు.
ఎక్కడా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హామీపై మోడీ మాట్లాడిన సందర్భం ఏ మాత్రం లేదు. కానీ.. శంకుస్థాపన రోజు మోడీ చెప్పిన మాటలను.. సరిగా అర్థం చేసుకోకుండా.. పవన్ మాట్లాడడం చర్చకు దారి తీసింది.
బాబును కలిసిన వెంటనే.. కేంద్రం గురించి మాట్లాడుతూ పవన్ ఏమన్నారన్నది జనం స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా మునుపటి యూపీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని.. మోడీ ఏపీ జనాలకు మాటిచ్చినట్టు పవన్ చెప్పారు. కానీ.. వాస్తవానికి మోడీ ఏం చెప్పారో పైనే చదివాం. విభజన చట్టంలో ఉన్న హామీలు తీరుస్తామని మోడీ చెబితే.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు తీరుస్తానని ఎలా చెప్పినట్టు అవుతుంది?
ఈ విషయం పవన్ కళ్యాణ్ అర్థమై మాట్లాడాడా? లేక బీజేపీని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడా? ఏదీ అర్థం కాక జనం మాత్రం తోచినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అన్న.. అర్థం లేని రాజకీయాలతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేశాడు. ఇప్పుడు తమ్ముడు కూడా జనసేన పేరుతో జనంలోకి వచ్చి.. ఇలా మాట్లాడుతుండడం చూసి.. ఇది కూడా పాత కథే అవుతుందని అంచనా వేస్తున్నారు.
