- Advertisement -

భ‌ర్త‌కు త‌గ్గ భార్య‌.. భూకబ్జా కేసులో హైకోర్టుకు బోండా సతీమణి

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంద‌రు వీధి రౌడీల్లా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. రెచ్చిపోయి త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తూ అంద‌రిపై దాడులు చేస్తుంటారు. అది చ‌ట్ట‌స‌భ‌నా.. న‌డిరోడ్డా అని చూసేది లేదు. త‌మ మాట నెగ్గాల్సిందే.. ఎవ‌రైనా త‌మ‌కు దండం పెట్టాల్సిందే మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. వారి వైఖ‌రితో అధికార ప‌క్షానికి చెడ్డ‌పేరు వ‌స్తున్నా రాజ‌కీయం కోసం భ‌రించాల్సి వ‌స్తోంది. ఆ విధంగా ప్ర‌వ‌ర్తించే వారిలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ బోండా ఉమామ‌హేశ్వ‌ర్‌రావు ప్ర‌ధానంగా ఉంటాడు.

అతడు చ‌ట్ట‌స‌భ‌ల్లో కూడా త‌న వైఖ‌రి మారాడు. ఆ మ‌ధ్య ఏ రా.. పోరా త‌దిత‌ర అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. అయితే ఇటీవ‌ల విజయవాడలో స్వతంత్ర సమర యోధుడి భూమి కబ్జా చేశాడ‌ని కేసులు న‌మోదుయ్యాయి. దీంతో అత‌డు ఇర‌కాటంలో ప‌డ్డాడు. ఇప్పుడు తాజాగా ఆ కేసులో ఎమ్మెల్యే బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8 వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు.

స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు సూర్య‌నారాయ‌ణ‌. ఆయ‌న‌కు 1951లో ప్రభుత్వం ఆయన సేవ‌ల‌ను గుర్తించి పదెకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే ఆ భూమిని 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేశ్ 2017 ఫిబ్రవరి 10వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ కావ‌డంతో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో అత‌డు ఫిర్యాదు వ‌ల‌న ఫలితం లేకపోవడంతో సురేశ్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -