టీఎస్టీ, కేఎస్టీ పేరుతో ప్ర‌జ‌ల్ని దోచుకుంటున్నారు….

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం జీఎస్‌టీ విన్నాం. కాని ఇప్పుడు మ‌రో రెండు టాక్స్‌లు రాష్ట్రంలో ఉన్నాయ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చెప్పారు. అదేంటి కొత్త‌గా ఉన్నాయ‌నుకుంటున్నారా…? మీరు విన్న‌ది నిజ‌మే. అవి ప్ర‌భుత‌వ్ ట్యాక్స్‌లు కాదు టీడీపీ ట్యాక్స్‌ల‌న్న‌మాట‌.

ప్ర‌స్తుతం గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట నియోజ‌క వ‌ర్గంలో లో జ‌గ‌న్ ప్రాజాసంక‌ల్ప యాత్ర కొన‌సాగుతోంది. స్పీక‌ర్ కోడెల నియోజక వ‌ర్గం కావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించ‌కుంది. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌జ‌ల‌నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. స‌భ‌లో బాబును, టీడీపీని జ‌గ‌న్ ఏకిపారేశారు.

నర్స‌రావుపేటలోని వ్యాపారులు, దుకాణదారులు జీఎస్టీతో బాధపడుతున్నార‌న్నారు. జీఎస్టీకి అదనంగా రాష్ట్రంలో టీఎస్టీ కూడా ఉంద‌న్నారు. టీఎస్టీ అంటే తెలుగు తమ్ముళ్లకు సంబంధించిన సర్వీస్‌ టాక్స్‌. జన్మభూమి కమిటీల నుంచి ప్రాజెక్టుల వరకు ప్రతి విషయంలో తెలుగుదేశం సర్వీస్‌ ట్యాక్స్‌ (టీఎస్టీ) కట్టాల్సిన పరిస్థితి వ‌చ్చింద‌న్నారు.

ఇక టీఎస్టీతోపాటు నర్సాపేట నియోజకవర్గంలో కేఎస్టీ ట్యాక్స్‌ కూడా కట్టాల్సిన పరిస్థితి నెలకొందని, రైల్వే కాంట్రాక్టుల నుంచి విద్యుత్‌ ప్రాజెక్టులు వరకు, కొటప్పకొండ కాంట్రాక్టు నుంచి మద్యం కాంట్రాక్టుల వరకు, కొత్త సినిమా రిలీజైనా ఆఖరికీ ఆటోలు, తోపుడు బండ్ల నుంచి కేఎస్టీ వసూలు చేస్తున్నారని నర్సారావుపేట టీడీపీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు.