- Advertisement -

కామ‌న్వెల్త్‌లో భార‌త్‌కు తొమ్మిదో స్వ‌ర్ణం….

- Advertisement -

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ప‌థ‌కాల జోరు కొన‌సాగిస్తోంది. ప‌థ‌కాల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. తాజాగా భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం చేరింది. టేబుల్ టెన్నిస్‌లో మహిళల జట్టు బాటలోనే పురుషుల జట్టు కూడా గోల్డ్ కోస్ట్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. నైజీరియాపై భారత పురుషుల జట్టు 3-0 తేడా గెలుపొంది పసిడిని చేజిక్కించుకుంది. ఆచంట శరత్ కమల్ 4-11, 11-5, 11-4, 11-9 తేడాతో బోడ్ అబియోడన్ మీద గెలవగా.. సాహిత్యన్ జ్ఞానశేఖరన్ 10-12, 11-3, 11-3, 11-4 తేడాతో సెగున్ టొరియోలాపై విజయం సాధించాడు.

ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఇది తొమ్మిదో స్వర్ణం కావడం విశేషం. ఈ ఒక్క రోజే భారత్‌ రెండు స్వర్ణాలు సాధించింది. తొమ్మిది పసిడి, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 18 పతకాలు సాధించిన భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

డబుల్స్‌లో హర్మీత్ దేశాయ్, సాహిత్యన్‌ జోడి 11-8, 11-5, 11-3 తేడాతో అబియోడిన్, ఒలాజిడె ఒమోటావోపై గెలుపొందింది. దీంతో భారత్‌కు పసిడి ఖాయమైంది. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకూ భారత్ టేబుల్ టెన్నిస్ విభాగంలో స్వర్ణ పతకం సాధించలేదు. కానీ 24 గంటల్లోనే రెండు పసిడి పతకాలు గెలుపొందడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -